Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతి ప్రవేశం కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు రంగారెడ్డి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.ఈ రామేశ్వరి దేవీ అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులై ఉండాలనీ, విద్యార్థులు 2016 జూన్ 1వ తేదీ నుంచి 2017 మే 31వ తేదీలోగా జన్మించి ఉండాలన్నారు. దరఖాస్తు ఫారముతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ సేవా ద్వారా తహసీల్దార్ ధృవీకరించిన కుల, ఆదాయ, నివాసంతో పాటు జనన ధృవపత్రాలు జత చేయాలని ఆమె తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం, రంగారెడ్డి జిల్లా, నాల్గవ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, లక్డికాపూల్, హైదరాబాద్ మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించాలని కోరారు. మార్చి 10వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.