Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మొయినాబాద్
యువత క్రీడల్లో రాణించి తోటి వారికి ఆదర్శమవ్వాలని తొలకట్ట గ్రామ ఉపసర్పంచ్ బొక్క రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తొలుకట్ట గ్రామంలో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత, నానమ్మ బొక్క భీంరెడ్డి, రుక్కమ్మ జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహించినట్టు తెలిపారు. అందులో 6 టీంలు పోటీపడగా సిద్ధి వినాయక క్రికెట్ టీం మొదటి బహుమతిగా రూ.10వేలు, రెండో బహుమతిగా మహమ్మద్ జహంగీర్ టీం రూ.5 వేలు గెలుపొందారని తెలిపారు. నగదు, బహుతులు ఉపసర్పంచ్ రవిందర్‌రెడ్డి విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో 6 జట్ల యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు