Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ నియోజకవర్గం కురుమ సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-బంట్వారం
పరిగిలో నిర్వహించిన 'మన ఊరు మన పోరు' సభలో రేవంత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి పై మాట్లాడిన తీరు సరైనది కాదు, ఎంపీ రంజిత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలనీ వికారాబాద్ నియోజకవర్గం కురుమ సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం అయన మాట్లాడుతూ ఎంపీ రంజిత్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా, కరోనా కష్టకాలంలో ప్రజలకు చేదోడుగా ఉన్నారని అన్నారు. టెలివిజన్ లేనివారి కోసం ప్రతీ పంచాయతీకి ఒక్కో టివిని తన సొంత డబ్భులతో ఇచ్చారని పేర్కొన్నారు. అంబులెన్స్, వికలాంగులకు మోటార్ సైకిళ్ళు, పలువురి జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అలాంటి వారిని నిందించడం సరైనది కాదున్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడడం బాధాకరం అన్నారు.