Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ తరపున రూ.5వేల ఆర్థిక సాయం
నవతెలంగాణ- మాడ్గుల
విద్యుదాఘాతంతో అకాల మరణం చెందిన ఇర్విన్ గ్రామ పంచాయతీ కార్మికుడు బోలేమోని వెంకటయ్య అంత్యక్రియలు ఆదివారం ఇర్విన్‌లో ముగిశాయి. అంత్యక్రియల్లో ఇర్విన్‌తో పాటు సమీప గ్రామాల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజమోని పుష్పలతజంగయ్య యాదవ్ అంత్యక్రియలకు గ్రామపంచాయతీ తరుపున రూ.5వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సూదిని శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, యారం జార్జ్‌రెడ్డి, పబ్బు యాదయ్య, జెళ్ళ శేఖర్, సయ్యద్ షరీన్, ఇతర నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.