Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నంలో చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో విజయవంతమైంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఇక ఎంపీపీ కృపేష్ ఎల్మినేడులో చుక్కలు వేశారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తమతమ గ్రామాల్లో చుక్కలు వేసి పోలియో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారుల పండంటి జీవితానికి పోలీయో చుక్కలు దోహదం చేస్తాయన్నారు. విధిగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలీయో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రధాన కేంద్రాల్లోనూ ఆదనంగా పోలీయో చుక్కల కేంద్రాలను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ కప్పరి స్రవంతి చందు, ఎంపీపీ కృపేష్, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు, బర్ల మంగ జగదీశ్వర్, నల్లబోళ్లు మమత శ్రీనివాస్ రెడ్డిపాల్గొన్నారు.