Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో గల ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం పోలియో చుక్కల ప్రక్రియను కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్లు లోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వారి నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి చిన్నారులకు పోలియో రహిత భవిష్యత్తును అందిద్దాం తెలియజేశారు. ఇప్పుడు మీరు వేయించే రెండు చుక్కలు మీ పిల్లల పోలియో రహిత నిండు జీవితానికి అండగా ఉంటుందని అన్నారు. కావున అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదేళ్ల లోపు వారందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదేండ్లలోపు వయసున్న పిల్లలందరూ టీకాలు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సీనియర్ నాయకులు,నర్సింగ్ నాయక్,ప్రకాష్, ప్రభాకర్ ,రంగస్వామి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.