Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సీసీ కెమెరాలు ప్రారంభించిన పలు అభివృద్ధి
కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
నవతెలంగాణ-మీర్ పేట్
మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలో 41వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బొక్క రాజేందర్ రెడ్డి సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి రూ 29లక్షల నిధులతో సిసి రోడ్డు, డ్రయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సాయి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కార్పోరేషన్‌ను అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందు ఉందని పేర్కొన్నారు. వర్షం కురిసింది అంటే చాలు భయాందోళన చెందేవారు. ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా శాశ్వతంగా పరిష్కరించబడిందని తెలిపారు. చెరువులను లింకు చేసేందు కూడా నిధులు మంజూరు కావడం జరిగిందని త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అడగ్గానే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లగూడ నుండి అల్మాస్ గూడ కామన్ వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నామని దానికి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న ఇంటి యజమానులు మార్కెట్ ధర ప్రకారం కోల్పోయిన ఇండ్లకు పరిహారం చెల్లించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డిఈ, ఎఈ, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాలనీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.