Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంట్వారం
బంట్వారం గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ ఆదివారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనంలో పల్స్ పోలియో కార్య క్రమాన్ని ప్రారంభించారు. చిన్నా రులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరిగా వేసుకోవాలని సర్పంచ్ విజయలక్ష్మి పండరి తెలి పారు. ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-తాండూరు రూరల్
పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మైలవరం గ్రామంలో సర్పంచ్ సిమా సుల్తానా బేగం, బషీరాబాద్ డాక్టర్ జనరల్ సర్జన్ పవిత్ర ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎమ్ కమలాబాయి, ఆశావర్కర్లు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-బషిరాబాద్
ఐదేండ్లలపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జడ్పీటీసీ మంజుల వెంకటేశం పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
నవతెలంగాణ-తాండూరు రూరల్
ఖాజాగుడలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 ఏండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా వేశారు.
నవతెలంగాణ-శేరిలింగపల్లి
కొండాపూర్ డివిజన్ పరిధిలోని పల్స్ పోలియో కేంద్రాలకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ బలరాం యాదవ్, రూపారెడ్డి, డాక్టర్ రమేష్, గిరి గౌడ్, మంగమ్మ, శ్యామల, నర్సింహులుగౌడ్, నాయుడు, కుమార్, పుణ్యవతి, లక్ష్మణ్, రఫియా బేగం, దీపక్, రమేష్ యాదవ్, రాజా మోహన్ రావు రఫీ, మొహ్మ్మద్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-శేరిలింగపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం డివిజన్ 106లోనెహ్రూ నగర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో పల్స్ పొలియో కార్యక్రమాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో పాటు స్థానిక పిహెచ్సి డాక్టర్ రామ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, సీనియర్ నాయకులు యదాగౌడ్, బస్తి ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, గాఫ్ఫార్, శ్రీకాంత్ దేవులపల్లి,రవి యాదవ్,మహేందర్ సింగ్, దివ్య, రాజ్ కుమార్, సుధాకర్‌రెడ్డి, పట్లోల్ల నర్సింహరెడ్డి, అలీం వినరు గౌడ్ మరియు కాలనీ వసూలు పాల్గొన్నారు.