Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
నిండు జీవితానికి రెండు చుక్కలను చిన్నారులందరికి చుక్కల మందులేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు కోరారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీలు, తాజా నాయకులు పోటీ పడి చుక్కల మందులేశారు. నార్సింగి మున్సిపాలిటీ గౌలిదొడ్డిల్లో చైర్పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి, బండ్లగూడ మేయర్ మహేందర్‌గౌడ్, హైదర్షాకోట్ అంగన్వాడీ కేంద్రంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, నార్సింగి 17వ వార్డుల్లో కౌన్సిలర్ కె ఉషారాణి, గండిపేట్ల్లో కౌన్సిలర్లు విజేత ప్రశాంత్‌యాదవ్, గోపాల సునితాగణేష్ కుమార్, ఖానాపూర్‌ల్లో కౌన్సిలర్ గున్నాల అమరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, వట్టినాగులపల్లిల్లో కౌన్సిలర్ యాదమ్మ, కోకాపేట్ ఐదవ వార్డుల్లో గంగిడి శివారెడ్డి, నార్సింగి 8వ వార్డుల్లో పత్తి ప్రవీణ్‌కుమార్, మహిళా మండల అధ్యక్షురాలు పత్తి శోభరాణి, మాజీ వార్డు సభ్యులు ఎస్కె ముక్తార్ పాషా, డైరెక్టర్ రాజుకుమార్, మంచిరేవుల్లో కౌన్సిలర్ మైలారం నాగపూర్ణశ్రీనివాస్, బండ్లగూడ కార్పొరేషన్ కిస్మత్పూర్లో కార్పొరేటర్ శ్రీలతాసురేష్ గౌడ్, 7వ డివిజన్ల్లో పద్మావతి పాపయ్య యాదవ్, బైరాగిగూడలో తలారి చంద్రశేఖర్, హైదర్షాకోట్ల్లో సంతోషిరాజీరెడ్డి, హిమాయత్సాగర్ల్లో కార్పొరేటర్ ముద్దం రాము, దర్గా ఖలీజాఖాన్ల్లో కో-ఆప్షన్ సభ్యులు మాలకీరత్నం, గంధంగూడలో కార్పొరేటర్ తలారి పద్మావతిపాండు, హైదర్షాకోట్ల్లో కార్పొరేటర్ షాపూరం పుష్పమ్మ, 14 వార్డుల్లో మాలతినాగరాజు, డైరెక్టర్ కాట సాయిబాబ పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వ స్కూల్, సబ్ సెంటర్లు, పోలీయో చుక్కల కోసం అంగన్వాడీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైధ్యాధికారులు, ఎఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.