Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ఆదివారం స్థానిక నాయకులతో ఆయన పలువురు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ చిన్నారులకు చుక్కల మందు వేయించాలని సూచించారు. అదేవిధంగా దేవుని పడకల్ గ్రామంలో సర్పంచ్ కాడమోని శ్రీశైలం ఉపసర్పంచ్ రాజమోని తిరుపతితో కలిసి చిన్నారులకు చుక్కల మందు వేశారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ముజీబుర్ రెహమాన్, ఎంపీటీసీ సభ్యులు మల్కేడి అంబాజీ, ఉప సర్పంచ్ ఎం.ఏ అజీజ్, ఏఎన్ఎం సువర్ణ, సుజాత, సూపర్ వైజర్ నాగమల్లేశ్వరి, వార్డు సభ్యులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.