Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కల మందును వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేండ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు విధిగా పోలియో డ్రాప్స్ వేయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండ స్వర్ణలతసతీష్, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గోన్నారు.