Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొడంగల్
పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ అన్నారు, ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండలం పర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ సయ్యద్ అంజాద్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్‌తో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బుగ్గప్ప, ఉప సర్పంచ్ మొగులయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జనార్ధన్ పాల్గొన్నారు.