Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మొయినాబాద్
యువత ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధిని ఎంచుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్య క్షురాలు, హిమాయత్‌నగర్ గ్రామ సర్పంచ్ ముదిగొండ మంజుల రవియాదవ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చెందిన కుమ్మరి మహేష్, దత్తులు గ్రామ రెవెన్యూలోని అజీజ్ నగర్ చౌరస్తా వద్ద నూతనం గా ఏర్పాటుచేసిన శ్రీదత్త ప్రింటింగ్ ప్రెస్‌ను ఆమె ఆది వారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంత రం ఆమె మాట్లాడుతూ యువత ఆర్థికంగా బలో పేతం కావడానికి స్వయం ఉపాధి ఎంతో దోహదపడు తుందని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఒకప్పుడు ఏదైనా పండుగలు, రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమయ్యే బ్యానర్లు, ప్రింటింగ్ పేపర్ల కోసం నగరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదని ప్రస్తుతం ఆ పని లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు విస్తరించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో నాయకులు ముదిగొండ రవియాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకు లు కనకమామిడి గడ్డం వెంకట్ రెడ్డి, ముదిగొండ మహేందర్ యాదవ్, పల్లగొల్ల అశోక్ యాదవ్, జల్లెల మల్లేష్ యాదవ్, ఎల్గని నరేందర్ గౌడ్, లక్ష్మీపతి యాదవ్, తూర్పు శ్రీనివాస్ రెడ్డి, వన్నాడ శివ కుమార్, మహేష్ యాదవ్ ఉన్నారు.