Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ తెలిపారు. తాండూరు పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ ఐడిఎల్ ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులు ఎలా ఉన్నా గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్, కౌన్సిలర్ సాజిద్ అలీ కరస్పాండెంట్ కీర్తి శర్మ వెంకటేష్ చారి, భానుప్రకాశ్, ఆకుల శివ తదితరులు పాల్గొన్నారు.