Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయలకిë, సుమలత
- మున్సిపల్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయలకిë, సుమలత అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఐద్వా నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ఆడపిల్లలను పుట్టనిద్దామని, వారిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై దాడులు, హత్యలు, లైంగికాదాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత కరువయ్యిందని చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జనాభా నిష్పత్తిలో అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 6సంవత్సరాల పిల్లల్లో ప్రతి 1000 మంది అబ్బాయిలు ఉంటే, 914 మంది మాత్రమే అమ్మాయిలున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు. మహిళా సంఘాల ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న 498ఏ చట్టం దుర్వినియో గమవుతుందన్నారు. విచ్చలవిడీగా మద్యం అమ్మకాలు, మాధకద్రవ్యాలు. పోర్నోగ్రఫీలు మహిళలు, బాలికలపై హింసకు మూల కారణాలన్నారు. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించిందని తెలిపారు. మద్యం షాపుల సంఖ్యను పెంచిందన్నారు. మద్యాన్ని అరికట్టకపోతే ఇంకా హింస కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. బెల్టుషాపులు రద్దు చేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. వరకట్నం లేని వివాహాలు కొనసాగిద్దామని చెప్పారు. ఆడపిల్లలు వంటింటికే పరిమితం కాకూదన్నారు. అడా, మగా తేడా లేకుండా సమానత్వం కావాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీ ఎన్నిక
ఇబ్రహీంపటం మున్సిపల్ ఐద్వా నూతన కమిటీని 7మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా షఫీఉన్నీసాబేగం, కార్యదర్శి కైరు ఉన్నీసాబేగం, ఉపాధ్యక్షులుగా మౌనిక, సహాయ కార్యదర్శిగా శిరీష, కళమ్మ, కోశాధికారిగా లలిత, ఎలమోని స్వప్న, సభ్యులుగా మంగ, శాంతమ్మ, జంగమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.