Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి విజరుకుమార్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీఎస్సీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో నిర్వహించే రాజ్యాధికార యాత్రను జయప్రదం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఎస్సీ రాష్ట్ర కార్యదర్శివిజరుకుమార్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ గ్యార మల్లేష్ అధ్యక్షతన శిక్షణ తరగతులు ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్వంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించనున్నారని చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కదలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఉద్యమాలకు ప్రజలను సమీకరించాలన్నారు. రాజ్యాధికార యాత్రలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. బహుజన రాజ్యాధికారంతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గ్యార జగన్, జిల్లా కార్యదర్శి పల్లాటి రాములు, అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్, ఉపాధ్యక్షుడు ధార యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోళ్ల గణేష్, కోశాధికారి కొండ్రు రఘుపతి, పల్లవి, సురేష్ పాల్గొన్నారు.