Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియా ప్రొఫెసర్ నర్సింలు
నవతెలంగాణ-గండిపేట్
విద్యార్థులు పరిశ్రమ రంగాల్లో టెక్నికల్, కొత్త పొకడలతో విజయాలను సాధించాలని ఉస్మానియా మూనివర్సిటీ ప్రొఫెసరులు నర్సింలు, గిరిబాబు తెలిపారు. ఆదివారం గండిపేట్ మండలం హిమాయత్‌సాగర్ లార్డ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మీకువా టెక్నాలజీ ప్రవేట్ లిమిటెడ్ సహాకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అడిటివ్ మ్యాను ఫ్యాక్చరింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్ధేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ పిఎ భాషా మొహిన్ద్దీన్, కార్యదర్శి రిజ్వానా బేగం, సెక్రటరీ సయ్యద్ తౌసీప్ ఆహ్మాద్, సయ్యద్ తన్వీర్, ఆహ్మాద్, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.