Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణంలో కార్పొరేటు ప్రయివేటు పాఠశాలలు ఫీజుల దందా ఇష్టానుసారంగా కొనసాగుతున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఏకంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రస్తుత అకడమిక్ సంవత్సరం (2021-22) పూర్తికాకముందే ఏకంగా 2022-23 గాను అడ్మిషన్లు ప్రారంభమైనవి అని స్థానిక తాండూరు పట్టణంలోని నారాయణ స్కూల్ ప్రచారం మొదలుపెట్టిందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నారాయణ స్కూల్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే స్కూల్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఒక్కొ విద్యార్థి దగ్గర రూ. 40 వేలు వసూలు చేస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యపై త్వరలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని తెలిపారు.