Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకట రమణ డిజిటల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్నారు. అత్యాధునిక యంత్రాలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆనందీశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను ఎమ్మెల్యే అభినందించారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ తోపాటు త్వరలో పెండ్లి పత్రికలు గ్రీటింగ్ కార్డులు కరపత్రాల ముద్రణ యంత్రాలు ఏర్పాటు చేసి అందుబా టులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్ర మంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, పద్మ ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యుడు పట్నం రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు పెద్దోళ్ల ప్రభాకర్, యువజన విభాగం అధ్యక్షు డు తోట చంద్రశేఖర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి, జి.వెంకట్ రెడ్డి, నాయకులు బండారి ఆగిరెడ్డి, జె.శ్రీకాంత్ రెడ్డి, అత్తెల్లి రవీందర్ రెడ్డి, అబ్దుల్ ఘనీ, రఘుపతి రెడ్డి, దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.