Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలౌతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని రామ్ నుంతల గ్రామ పంచాయతీ పరిధిలోని గేట్ తాండాలో ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కు తుందన్నారు. ఉపాధి హామీ నిధుల నుంచి రూ.5 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను నాణ్య తగా చేపట్టాలని సూచించారు. సర్పంచ్ వడ్త్యావత్ సోనా శ్రీను నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్, ఏఎంసీ వైస్ చైర్మెన్ తోట గిరి యాదవ్, ఎంపీ టీసీ సభ్యులు సరిత పంతునాయక్, కుమార్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, నాయకులు సయ్యద్ ఖలీల్, యాదయ్య పాల్గొన్నారు.