Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
వికారాబాద్ (అనంతగిరి) ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షునిగా నియమితులైన మేకల యాదయ్యను ఘనంగా సన్మానించామని బీజేపీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలోని బీసీల ను ఒకే తాటిపైకి తీసుకువచ్చి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన పైన నమ్మకంతో ఇంత పెద్ద బా ధ్యతను అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో బీజేవైఏం మండల అధ్యక్షులు మేకల నర్సింలు, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బుగ్గ య్య, బీజేవైఏం మండల ప్రధాన కార్యదర్శి మహేష్ కు మార్, నాయకులు రాజు ముదిరాజ్, ప్రతాప్ గౌడ్ పాల్గొన్నారు.