Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
గుడ్ మార్నింగ్ కాలనీస్ కార్యక్రమంలో భాగంగా కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు సీతారామ్ ధూళిపాళ ఆధ్వర్యంలో ఆదివారం మణికొండ పురపాలక సంఘం పరిధిలో ఉన్న శ్రీనివాసా కాలనీ సంక్షేమ సంఘం వారితో కాలనీలో నెలకొన్న సమస్యల గురించి చర్చిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యని తెలిపారు. అవసర కాల భద్రతా లోపాలను ప్రభు త్వం సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పందెం వాగు లో కొంతమేర శ్రీనివాస కాలనీ ఆనుకుని ప్రవహిస్తుం దన్నారు. ఎగువనున్న కాలనీల నుంచి మురుగునీరు వాగులోకి వదులుతున్న కారణంగా ఈ కాలనీవాసులు దుర్భర వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పందెం వాగుపై పైకప్పు నిర్మించిన కొంతమేర కాలనీవాసులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ విషయం గూర్చి త్వరలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి ఆంజనేయులు, శ్రీనివాస కాలనీ బాబురావు, చంద్రశేఖర్, బ్రహ్మానందం పాల్గొన్నారు.