Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాబంధు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- ప్రజాబంధుతో సమస్యల పరిష్కారం
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ప్రజా సమస్యలు వివిధ శాఖల అధికారుల దష్టికి తీసుకువచ్చేందుకు ప్రజాబంధు ఎంతగానో ఉపయో గపడుతుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ప్రజా బంధు యాప్‌ను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తోనే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆధా రంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాబంధు యాప్‌ను తీసుకవచ్చినట్టు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా తాండూరు పట్టణ కేంద్రంలో ప్రజాబంధు యాప్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. తాండూరు ప్రాంత ప్రజలంతా ప్రజాబంధు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ప్రజాబంధు యాప్‌లో ప్రజలు అప్లోడ్ చేసే సమస్యలు సంబంధిత ప్ర భుత్వ శాఖల అధికారుల దష్టికి వెంటనే చేరుతాయని తెలి పారు. వివిధ శాఖల అధికారుల దృష్టికి వచ్చిన సమస్య లకు వెంటనే పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని తె లిపారు. ప్రజాబంధు ద్వారా అధికారుల దృష్టికి వచ్చే సమ స్యల పరిష్కారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని తెలి పారు. తాండూరు ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, ప్రజల సమస్యలు పరిష్కారించడమే తమ కర్తవ్యం అని తెలిపారు. ప్రస్తుత సాంకేతియ యుగంలో ప్రజా సమస్యల పరిష్కారంకు ప్రజాబంధు యాప్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. రానున్న రోజు లలో ప్రజాబంధు యాప్ ఒక సంచలనంగా మారుతుం దని అన్నారు. తాను రూపొందించిన ప్రజాబంధు యాప్ ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరు ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రజాబంధు చక్కటి పరిష్కారం చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రజాబంధు యాప్ అవిష్కరణ కార్యక్రమంలో తాండూరు ప్రాంతానికి చెందిన వ్యాపార, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.