Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు-రంగారెడ్డికి
జాతీయహౌదా తీసుకురండి
- మా వ్యక్తిగత విషయాల
జోలికి వస్తే ఊరుకోం
- కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిధులు ఎందుకు మంజూరు చేయించుకోలేదు
- రేవంత్‌రెడ్డి, రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
' రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేయ్యొ, ఇద్దరం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం.' అని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి టీసీపీపీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సవాల్ విసి రారు.కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు టీఆర్ఎ స్పై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత విషయాల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆదివారం పరిగి పట్ట ణ కేంద్రంలోని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి 'మన ఊరు- మన ఊరు' కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయ కులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిం చారు. గుడ్లు అమ్ముకుంటే తప్పా అని ప్రశ్నించారు. తనకు గుడ్లు అమ్మడంతో పాటు అన్ని విషయాలు తెలుసు అని అన్నారు. తన వ్యాపారమే పౌల్ట్రీ వ్యాపారం రాష్ట్రంలో, దేశంలో చాలామందికి తెలుసని అన్నారు. తాను ప్రజలకు సేవచేయడానికి రాజకీయాలను వచ్చానని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి కొనసాగుతుందని, దానికి 30 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందులో చాలా వరకు పనులు పూర్తయ్యాయని వివరించారు. అప్పటి ప్రాణహిత-చేవెళ్ల కంటే ఇప్పటి పాలమూరు-రంగారెడ్డి కోసం సీఎం కేసీఆర్ మంచి ప్రపోజల్ తీసుకువచ్చారని అన్నారు. అప్పుడు మూడు లిఫ్టులతో 10 లక్షల సాగు కోసం, ఇప్పుడు ఆరు లిఫ్టులతో 12 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. అటువంటి సీఎం కేసీ ఆర్ గురించి మాట్లాడడం మానుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ని ఉరి తీసే అంత మొనగాడావా రేవంత్‌రెడ్డి అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. పార్లమెంట్లో వరి ధాన్యం గురించి అడిగేటప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రాలేదని, ఇప్పుడు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. అభివృద్ధిని చూసి ఎక్కడ కాంగ్రెస్ కొట్టుకుపోతుందని మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలో తెలియక ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, మరోసారి వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి తనపై పోటీ చేస్తే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అప్పుడు ప్రజాక్షేత్రంలో చూసుకుందామని తెలిపారు. మరోసారి చెత్త రాజకీయాలు చేయకూడదని హెచ్చరించారు.
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హౌదా తీసుకురా : ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పాలమూ రు-రంగారెడ్డికి జాతీయ హౌదా తీసుకురావాలని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు, ఎంపీలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వికారాబాద్ గురించి ఏం అవగాహన ఉందని ప్రశ్నించారు. 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వికారాబాద్ వచ్చినప్పుడు ప్రాణహి త-చేవెళ్లను ప్రాణహిత పరిగి వరకు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నా రామ్మోహన్‌రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు ఒక్క పైసా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన ప్రాజె క్టులన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిచేసి నీలు ఇస్తున్నారని తెలిపారు. నార్లపూర్, ఏదుల, వట్టెం కరివేన, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లిలో దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని రూ.18 వేల కోట్ల బిల్లు కూడా చెల్లించారని తెలిపారు. రూ.12వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని అన్నారు. నియోజకవర్గానికి ఉద్దండపూర్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నారు. ప్రధాన కాలువ పరిగి నుంచి తాండూరు వరకు పోతుందని, రెండేండ్లలో పూర్తి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. కావాలని కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఆపుతుందన్నారు. దమ్ముంటే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హౌదా తీసుకురావా లని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైల్వే లైన్‌కు 50 శాతం నిధులు ఎందుకు కేటాయించుకోలేకుండా పోయారని ప్రశ్నించారు. దేవాల యాల మాన్యం భూములు మింగేసానని అంటున్నావు.. అవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తే రేవంత్‌రెడ్డికే రాసిస్తానని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీలు నాగిరెడ్డి, హరిప్రియప్రవీణ్ రెడ్డి, మల్లిపెద్ది మేఘమాల ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మెన్ శ్యాంసుందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ భాస్కర్, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు అంజనే యులు, పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, హాజీ పటేల్, వెంకట్రాం రెడ్డి, వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.