Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శంషాబాద్
ఒకటో తేదీన జరిగే మహాశివరాత్రి పర్వదినం ఉత్సవాలకు శంషాబాద్ మండలంలోని ప్రముఖ శివాల యాలు ముస్తాబవుతున్నాయి. నర్కూడ, సిద్దులగుట్ట, ధర్మగిరి, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ శివాలయం తదితరాలు శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నారు. మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో విఠలేశ్వర ఆలయం (శివాలయం) శివరాత్రి మహౌత్సవాల కోసం సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దు తున్నారు. 27వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రుద్ర హౌమం, రుద్రాభిషేకం ఒకటవ తేదీన శివపార్వతుల కళ్యాణ మహౌత్సవం, ఊరేగింపు నిర్వహించనున్నారని ఆలయ కమిటీ ఆదివారం తెలిపింది. రెండో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని గ్రామ వార్డు సభ్యులు టీ. కుమార్‌గౌడ్ తెలిపారు. శివాలయం వద్ద ఉపవాస దీక్షలు విడవడానికి ప్రజలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు.