Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలియో చుక్కలు వేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వికారాబాద్ శాసనస భ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న ప్రతి చిన్నారికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పోలియో రాకుండా చిన్నారులకు రెండు చుక్కల మందును తప్పక వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్, ఏఎంసీ చైర్పర్సన్ ముద్ద దీప, ఆస్పత్రి వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.