Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పరిగికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి ఆషిష్ కుమార్ కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆషిష్కుమార్కు వీడియో కాల్ చేసి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జప్రోజియాలో ఉన్నామని, బంకర్లలలో తలదాచుకున్నామని, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నామని ఆషిష్ ఎమ్మెల్యేకు తెలిపారు. మరో పది రోజుల్లో పరీక్షలు రాసి ఇంటికి రావలసి ఉండగా యుద్ధం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనను సంప్రందించాలని, ప్రభుత్వంతో మాట్లాడి ఇండియాకు రప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలుగు విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆషిష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిగి ము న్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్‌కుమార్, పీఏసీఎస్ చైర్మెన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు అంజనేయులు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ బొజ్యనాయక్, రవి తదితరులు పాల్గొన్నారు.