Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలోని పోలీస్ అధికారులు అందరూ సోమవారం పౌరహక్కుల దినంగా జరుపుకోవాలని వికా రాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తూ ప్రజలలో పౌరహక్కుల గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు తమ ప్రాథమిక హక్కులపైనా అవగాహన కల్పించాలన్నారు. మనం అందరం మనషులమే అందరికీ ఒకే రకమైన హక్కులు రాజ్యాంగం కల్పిస్తుందని తెలిపారు. జాతి, రంగు, మతం, లింగం, భాష, హౌదాలకు రాజ్యాంగంలో ఎలాంటి తావులేదని ప్రజలకు తెలపాలన్నారు. ప్రతి నెల చివరి రోజున పౌరహక్కుల దినం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.