Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో
చుక్కలు వేయించాలి
- మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్
నవతెలంగాణ-తాండూరు
నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు ఎంతో అవసరమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పట్టణంలోని చిల్డ్రన్ హెల్త్ కేర్ సెంటర్లో అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డ్ల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెంకన్నగౌడ్, రామకృష్ణ, వైద్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.