Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
మద్యం తాగి అకస్మాత్తుగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఏ ఎస్ఐ రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామా నికి వడిక చర్ల మహేందర్ (45) కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యం తాగడానికి శనివారం సాయంత్రం పాలమాకుల గ్రామంలోని ఎంకెవై వైన్స్‌కు వచ్చాడు. అయితే చీప్ లిక్కర్ కొనుగోలు చేసిన అతను వైన్స్ పక్కనే పర్మిట్ రూమ్‌లో మద్యం తాగి, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన వైన్స్ నిర్వాహకులు అతన్ని చూడగానే అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికంగా ఉన్న వైద్యుడిని పిలిపించి పరీక్షించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందిస్తే వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.