Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సబ్ ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం మద్దూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి (52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఆదివారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై నగరంలోని పూల మార్కెట్‌కు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యాడు. మండల పరిధిలోని రామంజాపూర్ గ్రామ సమీపంలోని సోలిపేట టర్నింగ్ షాబాద్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న చికెన్ సంబంధించిన లారీ, ద్విచక్ర వాహనం రెండు ఢకొీన్నాయి ఈ ప్రమాదంలో సంజీవరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.