Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదుకోవడం అభినందనీయమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని నేషనల్ గార్డెన్స్‌లో రహభర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని చిరు వ్యాపారులకు కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారికి తోపుడుబండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు యూసఫ్‌ఖాన్, తాహెర్ కురేషి, అజహర్ మూలాన,ఫరూక్ కురెషి, పాషా కురెషి, మహమూద్ ఖాన్,సాదిక్ కూరేశి, సయ్యద్ జుబేర్ లాలా, టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు, మాజీ డీసీసీబీ చైెర్మెన్ పి.లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ రంగారెడ్డి , డీసీసీబీ డైరెక్టర్ సంగెం రవీందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ సిధ్రాల శ్రీనివాస్, కౌన్సిలర్ రాము మన్నపురం, కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖావి, బీదర్ రాజశేఖర్, అశోక్ మంతన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.