Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
గ్రామాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తానని దిలావర్గూడ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో రూ.15 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీరోడ్డు పనులను ఎంపీటీసీ హనుమగల్ల చంద్రయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. పెండింగ్ పనులను దశల వారిగా పూర్తి చేస్తానని ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ఫర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పి.మల్లేష్, ఎం.మల్లేష్, బాస్కర్, రేణమ్మ, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.