Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం షాద్‌నగర్ పట్టణంలో గల ఠాగూర్ ఉన్నత పాఠశాల ఆడిటోరియం లో చెకుముకి సైన్స్ సంబురాల్లో భాగంగా విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చెకుముకి ట్యాలెంట్ టెస్ట్ బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్ రావు పాల్గొని మాట్లాడారు. సీవీ రామన్ నోబెల్ బహుమతి అందుకున్న విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థు లకు చిన్నప్పటి నుండే ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు. ప్రశ్నించ డం అలవాటు చేసుకోవడం వలన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమ తులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటరమణ, రాష్ట్ర హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, షాద్‌నగర్ పట్టణ అధ్యక్షులు కురుమయ్య, ఠాగూర్ పాఠశాల నిర్వాహకులు రవి ప్రకాష్, పట్టణ కార్యదర్శి రజాక్, జిల్లా నాయకులు కిశోర్, రఘురామ, కృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.