Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
పోలియో మహమ్మారిని సమాజం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజా ప్రతినిధులు బాధ్యతగా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నట్టు ఆమె వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 1,551 పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3 లక్షల 92 వేల 943 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నట్టు తెలిపారు. ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చిన్నా రులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, డాక్టర్ సత్యజ్యోతి, ఆస్పత్రి సిబ్బంది శ్రీనివాస్, బాబురెడ్డి, కిరణ్, స్వప్న, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, తదితరులు ఉన్నారు.