Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ పల్లాటి బాల్రాజ్
నవతెలంగాణ-మంచాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు- మన బడి' కార్యక్ర మం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని సర్పంచ్ పల్లాటి బాల్రాజ్, ప్రధానోపాధ్యాయులు ఎస్. రాజిరెడ్డి తెలిపారు. ఆదివా రం నోముల పాఠశాలలో యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ' మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా పాఠశాల ల్లో నిరంతర విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, నూతన గదుల నిర్మాణం, గోడ, తరగతి గదుల్లో ఫాన్లు, బెంచీలు, లైబ్రరీ, మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తామని తలెఇపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మెన్ పల్లాటి జగన్, వైఎస్ చైర్మెన్ గంట లిఖిత. ఎస్ఎంసీ సభ్యులు నల్ల ప్రభాకర్, పల్లాటి యాదయ్య, పల్లాటి శ్రీనివాస్, పల్లాటి సుధాకర్, వార్డు సభ్యులు చింతక్రింది వీరేశ్, ఉపాధ్యాయులు బాలునాయక్, ఐలయ్య పాల్గొన్నారు.