Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.80లక్షల నిధులతో నూతన భవనం నిర్మాణం
- రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్
పాండురంగారెడ్డి
నవతెలంగాణ-షాబాద్
గత పాలకుల వివక్ష వలనే గ్రంథాలయాలు శిథిలావస్థలో ఉన్నా యని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన షాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో షాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయం సంస్థ నిధులతో రూ. 80లక్షల నిధులతో నూతన భవనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నూతన భవన నిర్మాణానికి టెండర్లను ఆహ్మానించుటకు తెలంగాణ విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. జిల్లాలో శిథిóలావస్థలో ఉన్న గ్రంథాలయాల స్థానంలో నూతన భవనాలను ఏర్పాటు చేస్తామన్నారు.