Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ లక్ష్మీప్రవళికిరణ్కుమార్
నవతెలంగాణ-గండిపేట్
నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చూపుతామని కౌన్సి లర్ కోల్లూర్ లక్ష్మీప్రవళిక అ న్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీలోని 9,18 వార్డు ల్లో దాదాపు రూ. 5లక్షలతో కొత్త పైపులైన్‌తో పాటు గేట్వాల్స్ను ప్రారంభించారు. జలమండలి, మున్సిపల్ అధికారుల చొరవతో ప్రజలకు తాగునీటిని అందిస్తున్నట్టు తెలిపారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారిగా అమలు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ చొరవతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నరేష్, మాజీ వార్డు సభ్యులు కైకొండ వినోద్‌కుమార్, మహేందర్ గౌడ్, సత్యనారాయణ, పరమేష్ నిఖిల్, మహేష్, పాల్గొన్నారు