Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైటింగ్, రంగులతో అలంకరణ
నవతెలంగాణ-గండిపేట్
మహాశివరాత్రి పండుగను పురష్కరించుకున్ని దేవాలయాలను ముస్తాబు చేశారు. అలయా కమిటీ నిర్వహాకులు పండుగకి ముందు నుండి శివాలయాలను రంగులతో అద్దంగా అలంకరించారు. వీధి దీపాలు, లైటింగ్ ఏర్పాటు చేశారు. టెంపుల్కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండ నిర్వహాకులు ఏర్పాటు చేశారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో మంచిలేశ్వర్ టెంపుల్ అందంగా సుందరీకరించారు. బైరాగిగూడలో శివాలయాన్ని రంగులతో సుందరీకరించారు. నార్సింగి, మంచిరేవుల, గండిపేట్, కోకాపేట్, హైదర్షాకోట్, గందంగూడ, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కిస్మత్పూర్, బండ్లగూడలో శివాలయాలను రంగులతో ముస్తాబు చేశారు. ప్రజలందరికి పూజల్లో పాల్గొనేందుకు నిర్వహాకులు టెంట్లు, మంచినీటి వసతిని కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండ అన్ని ఏర్పాటు చేశామని నిర్వహాకులు తెలిపారు.