Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడి నుంచి చోరీ స్వాధీనం
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తిన్నింటి వాసాలు లెక్కించడం అంటే ఇదేనేమో అలాంటి నానుడిని నిజం చేస్తూ భారీ చోరీకి పాల్పడ్డ నిందింతుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని మదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం నారాయణ్‌పేట్ జిల్లా, ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన శంకర్ కుటుంబం మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివసించే వ్యాపారి వాసు దేవరెడ్డి ఇంట్లో గతంలో వాచ్‌మెన్‌గా పని చేశారు. అప్పుడు యజమాని లేని సమయంలో ఇంటి తాళ్లాన్ని డూప్లికేట్ తాళం తయారు చేసుకుని, పని మానేసి వారి సొంత ఊరికి వెళ్లిపోయారు. వాచ్మెన్ శంకర్ కుమారుడు శివకుమార్ గతంలోలోనే ఓ అపార్ట్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను దొంగిలించి నెంబర్ ప్లేట్ మార్చేశాడు. ఫిబ్రవరి 24వ తేదీ నాడు వాసుదేవరెడ్డి ఇంటికి తాళం వేసి అజీజ్‌నగర్‌లో ఉండే తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ కావూరిహిల్స్‌కు వచ్చి నకిలీ తాళంతో నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి అల్మారాను స్క్రూ డ్రైవర్ తో తొలిగించి అందులో నుండి 20 లక్షల నగదు, కొన్ని విదేశీ నోట్లు, బంగారు ఆభరణాలు, కొన్ని ఇతర విలువైన వస్తువులు తీసుకొని 25 నాడు తన దొంగ బైక్ పై సొంతూరుకు పారిపోతుండగా శంషాబాద్, చటన్ పల్లి వద్ద పోలిసులు పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్దనుండీ బ్లూ కలర్ బ్యాగ్, 24 లక్షల 63 వేల నగదు,14 తులాల బంగారు ఆభరణాలు, 8134 యూఎస్ డాలర్లు, ఇతర విలువైన వస్తువులు మొత్తం 50 లక్షల విలువ గల చోరీ సొత్తుతో పాటు, బైకు, స్క్రూ డ్రైవర్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును తొందరగా చేధించిన మాదాపూర్ పోలీస్ సిబ్బందికి రివాడ్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏసీపీ రఘునందన్ రావు, సిఐ రవీంద్ర ప్రసాద్, డిఐ మధు, ఎస్సైలు రాజేంద్ర, సుఖేందర్ రెడ్డి, మోహన్‌రెడ్డి, డి ఏసీఐ సర్దార్, ఏఎస్ఐ వెంకటేశం, కానిస్టేబుళ్లు సత్యనారాయణరెడ్డి, రాజేష్, జగన్, చిన్నయ్య, వెంకటేశం, రాఘవేందర్, సిద్దేశ్వర్, మన్సూర్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, లక్ష్మప్ప, బాల్‌రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.