Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోడంగల్
బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం కొడంగల్ మున్సిపాలిటీలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ సామ్య నాయక్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కొడంగల్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ కాలనీకి చెందిన ఏ.మోహన్, అనసూయ దంపతుల పెద్ద కుమారై లక్ష్మి (14) స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో, మనస్తాపం చెందిన బాలిక కాలనీ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.