Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ హిమాయత్‌సాగర్ టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ అధ్యక్షులు గోకరి సురేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకరావాలని తెలిపారు. మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అద్యక్షులు గోకరి సురేష్‌గౌడ్, నాయకులు చెగూరి రాజు, మాజీ ఎంపిటీసీ వేణుగోపాల్, అధ్యక్షులు నర్సింగ్‌రావ్, దయానంద్, గౌరిశంకర్, అంతారం నరేష్, పరమేష్చ శ్రీనాథ్,మహేష్, రాజు, కుమార్, నాగరాజు, కిరణ్, రాజు, సందీఫ్, తదితరులు పాల్గొన్నారు.