Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఈ నెల 28, 29న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్దఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, హె చ్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షులు పానుగంటి ఆనంద్ కోరారు. సోమవారం కాటేదాన్‌లోని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తూ ఉందని వారు అన్నారు. కార్మికుల చట్టాలను పూర్తిగా మార్చి కార్మికులను బతుకులతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటున్నని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్ శక్తులకు అమ్ముతుందన్నారు. ఎల్ఐసీ, రైల్వే, బీఎస్ ఎన్ఎల్, బొగ్గు రక్షణ రంగం తదితర సంస్థలను అమ్మేస్తున్నరాని అన్నారు. అలాగే కార్మికులకు సంబంధించి బడ్జెట్ కేటాయించడంలో కేంద్ర ప్రభు త్వం విఫలం అయిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పానుగంటి పర్వతాలు, అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కో శాధికారి మలేష్, కురుమయ్యా, రుద్రకుమర్, ప్రకాశ్ కారత్, టీఆర్ఎస్కేవీ దామోదర్ రెడ్డి, భవాని మలేశ్, ఆర్‌యస్ రమేష్, హెఎంఎ స్ నాయకులు లల్సింగ్, మల్లేశ్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.