Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మైనార్టీ, మేదరి, యాద వులు, వైశ్యులు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో తమకు మండల కేంద్రంలో భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కావాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతుబంధు దేశానికి ఆదర్శం అన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సహకార సంఘం చైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురసాని సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, జల్లపల్లి కౌన్సిలర్ షంషోదీన్, టీఆర్ఎస్ యువజన సం ఘం అధ్యక్షులు కొలను విగేశ్వరరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం నాయకులు తాళ్ల కార్తీక్, మాజీ సర్పంచ్ పసుల పర్వతాలు, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిర్ర సాయిలు, మేదరి సంఘం అధ్యక్షులు స్వామి, సభ్యులు సతీష్, వెం కటేష్, రాజు, ప్రవీణ్, శ్యామ్, నాయకులు కాకి నరసిం హ, శేఖర్ గుప్తా, కార్యకర్తలు, మైనార్టీ సంఘం అధ్య క్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.