Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ హామీ
నవతెలంగాణ-కల్చరల్
గ్రామాల్లో కుట్టు పని వారికి, పేద టైలర్లుకు ఉపయోగపడే విధంగా మేరు ఫెడరేషన్ ఏర్పాటు అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని సాంఘీక, బడుగు వర్గాల సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ హామీ నిచ్చారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై సోమవారం మేరు సంఘం నిర్వహణలో మేరు( టైలర్స్) దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా కమలాకర్ పాల్గొని మాట్లాడారు.. నేతన్నలు నేసిన బట్టలను అందంగా వివిధ రూపాలలో కుట్టి అందించే దర్జీ సోదరులు ఆత్మవిశ్వాసంతో బతికేందుకు ఆత్మ గౌరవ భవన్ కోసం ప్రభుత్వం ఎకరా స్టలం కోటీ రూపాయలు భవన్ నిర్మాణానికి మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసారు.బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకులా భారణం కృష్ణ మోహన రావు మాట్లాడుతూ విలియం గెల్యూస్ బూ కుట్టు యంత్రం కనిపెట్టిన రోజును అంతర్జాతీయ మేరు( టైలర్స్) దినోత్సవం జరుపు కొంటున్నారని గుర్తు చేశారు.