Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మార్కండేయ నగర్లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక సమస్యలపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మార్కండేయ నగర్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా నర్సాబారు కుంటలో పిల్లల కోసం పార్కు స్థలం కేటాయించాలని, అదేవిధంగా బస్తీలో సీసీరోడ్లు, అండర్ డ్రయినేజీ సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా మహిళల కోసం మహిళా భవనం నిర్మించాలని మహిళలు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ బస్తీలో అండర్ గ్రౌండ్, డ్రయినేజీ, సీఈరోడ్ల సమస్య పరిష్కారానికి వెంటనే ప్రతిపా దనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదే శించారు. అదేవిధంగా నర్సా బారు కుంటలో పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కుంటలో మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మహిళా భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ ఉప కమిషనర్ జగన్, తహసీల్దార్ చంద్రశేఖర్‌గౌడ్, స్థానికులు వెంకటేష్, సత్యనారాయణ, యాదగిరి, జగదీష్, సూర్యనా రాయణ, గోపాల్, రమేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.