Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఏనుగు శ్రావణి జంగారెడ్డి
నవతెలంగాణ- కందుకూరు
వాడవాడలా సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని సర్పంచ్ ఏనుగు శ్రావణి జంగారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల పరిధిలోని దెబ్బగూడ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా 10 లక్షల రూపాయలతో సీసీరోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నమన్నారు. సమస్యలు లేకుండా కృషి చేస్తామన్నారు. దశలవారీగా గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, ఎంపీటీసీ ఎల్మట్టి లక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులు జీ. రాజేందర్ రెడ్డి , వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.