Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండలపరిదిలోని యాంకి గ్రామనికి చెందిన కళాకారుడు సున్నపు అశోక్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. తను చిత్రకారుడిగా, సూక్ష్మ చిత్రకళాకారుడిగా సుపరిచితుడు. సుద్ద ముక్కలు చింత గింజలు కవేవి తన కళకు గమనర్వహం అంటూ వివిధ సూక్ష్మ కళ కృత్యులను రూపొందించినందుకు గాను ఈ అరుదైన అవకాశం దక్కింది. సోమవారం హైదరాబాద్‌లోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షు లు చెర్మెన్ డా'' చింతపట్ల వెంకటచారి చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం, జ్ఞాపిక, బ్యాచ్ పథకంను అందజేశారు. వెంకటాచారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండి కళ కోసం పరిస్థాపిస్తున్న అశోక్‌ని అభినందించారు. ఈ అవార్డ్‌ను అందుకున్నందుకు అశోక్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రాజ్ ప్రభాకర్, కవాలి వెంకటయ్య, కోటికె శ్రీనువాష్, అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.