Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌ఈడబ్లూఐడీసీ చైర్మెన్ నాగేందర్‌గౌడ్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
స్వరాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని టీఎస్‌ఈడబ్లూఐడీసీ చైర్మెన్ నాగేందర్‌గౌడ్ అన్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో దూసు కుపోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లా అన్నిరం గాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా పరిషత్ భవ నం నిర్మాణంకు రూ.5 కోట్ల 10 లక్షలు ఖర్చు చేస్తు న్నట్టు తెలిపారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి నట్టు తెలిపారు. రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే దళితబంధు, కల్యాణలక్ష్మితోపాటు అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్టు తెలిపారు. కొత్త మండలాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి గొప్పగా పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.