Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల జోలికొస్తే ఊరుకునేది లేదు
- తాండూరు మార్కెట్ కమిటీ చైర్మెన్ విట్టల్ నాయక్
నవతెలంగాణ-తాండూరు
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ విట్టల్ నాయక్, వైస్ చైర్మెన్ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప నర్సింలు, టీిఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్, శ్రీనివాస్ చారిలు అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లా డుతూ.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ' మన ఊ రు-మన పోరు' సభలో ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలపై చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పాలమూరు- రంగారెడ్డికి ప్రభుత్వం నిధులను విడుదల చేసి పనులు కొనసాగిస్తుంటే దీనిపై కోస్గికి చెందిన నేతతో కోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి సబితా రెడ్డిపై వాఖ్యలు చేయడం నీచమన్నారు. చేనేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ల వ్యాపారంలో ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో పాఠశాలల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అలాంటి ప్రజా నేతపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. పరిగి, తాండూరు నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడుతున్నారని విమర్శించా రు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఏజెంట్గా పనిచేశారని ఆరోపించారు. మరోసారి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై నోరుజారితే ఊరుకోబోమని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్చార్జి ఇంతియాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.